24-02-2026 12:00:00 AM
సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి నా క్యారెక్టర్‌పై దుష్ప్రచారం
మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వ్యవహారంలో తెలంగాణ తల్లి రూపశిల్పి రమణారెడ్డి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 23 (విజయాక్రాంతి): తనను కేటీఆర్ ఫ్యాన్‌క్లబ్ వాళ్లు ట్రోల్ చేస్తున్నారని తెలంగాణ తల్లి రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాల రూపకల్పనలో తోడ్పాటు అంది స్తున్న తనలాంటి శిల్పి, కళాకారుడిపై ఒక పత్రిక, ఛానల్, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చెయ్యడం తగదని ఆయన పేర్కొన్నారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిని కాదని, ఒక కళాకారుడినని అన్నారు. కేటీఆర్ ఫ్యాన్‌క్లబ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తన క్యారెక్టర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు నోటీసులు వచ్చాయని, అందులో కూల్చేస్తామని కానీ, ఖాలీ చేయాలని కానీ లేదని తెలిపారు.
అసలు ఆ వివాదంలో తనకు సంబంధం లేదని, తన సతీమణి తా ము ఇంటిని కోల్పోతామేమో అన్న ఆందోళనలో మాట్లాడిన మాటలకు తనకు సంబం ధం లేదన్నారు. ఈ సందర్భంగా తాను చెప్పని అంశాలను ఓ పత్రిక ప్రచురించిందని, ఆ విషయంపై వివరణ ఇచ్చినందుకు తనను కేటీఆర్ ఫ్యాన్‌క్లబ్ మీడియా హ్యాం డిల్ నుంచి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రేవంత్‌రెడ్డిని కానీ, కేసీఆర్‌ను కానీ తిట్టలేదని తెలిపారు.
ప్రభుత్వం సమస్యపై చర్చించేందుకు మాత్రమే నోటీసులు ఇచ్చిందని చెప్పారు. గాంధీ సరోవర్ అద్భుతమైన ప్రాజెక్ట్ అని అన్నారు. ‘మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లోని 450 కుటుం బాల్లో నేను ఒకడిని. దీనికి ఒక మిటీ ఉంది. ఆ కమిటీ అన్నీ చూసుకుంటోంది’ అని వివరించారు. ఒకవేళ ప్రభుత్వం విగ్రహం డిజైన్ విషయంలో తన సహకారం కోరితే తాను తప్పకుండా ప్రభుత్వానికి సహకరిస్తానని తెలిపారు. తనపై ఇకనైనా దుష్ప్రచారాన్ని ఆపకపోతే సదరు సంస్థలపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.