12 March, 2026 | 4:57 PM

ఎల్‌పీజీ సంక్షోభం.. కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ

12-03-2026 02:48 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి(Union Minister Hardeep Singh Puriబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) లేఖ రాశారు. వాణిజ్య, గృహ ఎల్పీజీ సిలిండర్ల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. సిలిండర్ల కొరత(LPG crisis) ఆహార వ్యాపారాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. హోటల్లు, హాస్టళ్లు, చిన్న ఆహార వ్యాపారాలను ప్రభావితం చేస్తోందన్నారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది సంస్థలు మూసివేయవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత వల్ల కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు.

గురువారం మూడు పేజీల లేఖలో కేటీఆర్ మాట్లాడుతూ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కొరత(Shortage of LPG cylinders) సంక్షోభ నిష్పత్తులకు చేరుకుందని, పారదర్శక సరఫరా డేటా లేకపోవడం వల్ల వ్యాపారాలలో నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అనిశ్చితి ఏర్పడుతున్నాయన్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు రియల్ టైమ్ పంపిణీ డేటాను కలిగి ఉన్నాయని, కానీ దానిని బహిరంగపరచడం లేదని, హోటళ్ళు, హాస్టళ్లు, చిన్న తినుబండారాలు, సేవా సంస్థలు(Service organizations) కార్యకలాపాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. సరఫరా పునరుద్ధరించకపోతే హైదరాబాద్, తెలంగాణ అంతటా దాదాపు 90 శాతం హోటళ్ళు, తినుబండారాలు 48 గంటల్లోపు మూతపడే అవకాశం ఉందన్నారు. సిలిండర్ల కొరత కారణంగా పీజీ హాస్టళ్లు, విద్యార్థుల వసతి గృహాలు, కార్పొరేట్ ఫలహారశాలలు ఇప్పటికే భోజనాన్ని తగ్గిస్తున్నాయని తెలిపారు.