రామోజీరావు పార్థివదేహానికి బీఆర్ఎస్ నేతల నివాళులు
హైదరాబాాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, సబితా ఇద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. తెలుగు పత్రిక రంగంతో పాటు తెలుగు మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు రామోజీరావు బీజం వేశారని కేటీఆర్ అన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నంగా ఆయన చిరకాలం నిలిచిపోతారని తెలపారు. రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు. 1936 నవంబర్ 16 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు.






