26 February, 2026 | 3:47 AM

జినుగురాళ్ల ఘటనపై స్పందించిన కేటీఆర్

26-02-2026 12:00 AM
  1. దేవరకద్ర మండలంలో పల్లె ప్రకృతి వనాన్ని కొట్టేస్తే ఎట్లా? అనే కథనం విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితం 

పల్లె ప్రకృతి వనంలో 200 చెట్లు కొట్టేస్తే పట్టించుకునే వారే లేరని ప్రశ్నించిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి) : దేవరకద్ర నియోజకవర్గంలో ఉత్త మ గ్రామపంచాయతీ అవార్డు పొందిన జినుగురాళ్ల గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను తొలగించారు. ఈ విష యంపై ’పల్లె ప్రకృతి వనం కొట్టేస్తే ఎట్లా? అనే కథనం విజయక్రాంతి దినపత్రిక నందు ఈనెల 23వ తేదీన కథనం ప్రచురితమైంది. ఈ కథనం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దా రితీసింది.

అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకున్నప్పటికీ పల్లె ప్రకృతి వనానికే రక్షణ లేకుంటే అడవితోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న చెట్లకు రక్షణ కవచంగా ఎవరు నిలబడతారని ప్రజలే చెబుతున్న మాట. అధికార యంత్రం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షణ చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం ఆశించిన అడుగులు పడ లేదని తెలుస్తుంది. ఈ విషయంపై బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనలో భాగంగా మృతి చెందిన పసిబిడ్డ తల్లిదండ్రులను ఓదార్చేందుకు వచ్చిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జినుగురాళ్ల పల్లె ప్రకృతి విషయాన్ని ప్రస్తావించడంతోపాటు పాటు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దేవరకద్ర లోని జినుగురాళ్ల గ్రామంలో 200 చెట్లతో కూడిన పల్లె ప్రకృతి వనాన్నే కొట్టేస్తే ఎవరు పట్టించుకోవడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు, పల్లె ప్రకృతి వనాలు సైతం ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అతి తక్కువ రోజుల్లోనే పల్లెల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్పందించడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రకృతి వనాన్ని కొట్టేయడం ఏమిటీ అనే చర్చ మరో సారి ఉపందుకుంది.