calender_icon.png 29 September, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. ఏ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే

29-09-2025 02:18:24 PM

అదే కాంగ్రెస్ పాలనలో బ్రహ్మాస్త్రం.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. ఏ ఎన్నికైనా సిద్దమే.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కేవలం 22 నెలల పాలనలో సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేసిందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సోమవారం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విశ్వాసం కోల్పోయి మరోసారి కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి వైపు పయనిస్తోందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్(KTR) వెల్లడించారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుందని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూలమే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని అనుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్టులను గుర్తుచేసేందుకు.. మేము 'బాకీ కార్డులను'(Congress Party Baki Card) తీసుకువచ్చామని కేటీఆర్ సూచించారు. బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ బాకీలు ఇంటింటికీ చేర్చడానికి ఉద్యమించామని వివరించారు. బాకీ కార్డులు ఇంటింటికి తీసుకుపోతే, అదే కాంగ్రెస్ పాలనలో బ్రహ్మాస్త్రం అన్నారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే చేతనైత లేదు.. కానీ ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి ఫోజులు కొడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. మున్సిపల్ శాఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ ధ్వజమెత్తారు.