calender_icon.png 29 September, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బట్వాన్ పల్లిలో భూ బాధితుల ఆందోళన

29-09-2025 02:11:34 PM

పంది మాంసంతో వినూత్న నిరసన

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివ ల ఇంటిదట బాధిత వడ్డెర కులస్తులు సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నకిలీ భూమి పత్రాలు చూపించి తమ నుండి రూ 45 లక్షలు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు డబ్బులు చెల్లించే వరకు గ్రామంలోనే నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్న బాధితులు గ్రామంలోని పంది మాంసాన్ని వండుకుని వినూత్నమైన రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.