calender_icon.png 25 May, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ దెయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి

25-05-2025 01:15:30 AM

-రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యా లు ఎవరో కేటీఆర్ చెప్పాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నిం చారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం కంటే ముందు కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయని కవిత చేసిన వ్యా ఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్, తమ నాయకులపై బీఆర్‌ఎస్ చేసే బేస్ లెస్ ఆరోపణలపై తాము స్పందించమన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయని, అందుకు తాను రాసిన లేఖ లీక్ కావడమే నిదర్శనమని కవిత చెప్పినట్టు గుర్తుచేశారు.