25-05-2025 01:14:23 AM
-చెల్లెలి దెబ్బకు కేటీఆర్ మెదడు చితికిపోయింది
-మోదీ మెప్పు కోసమే ఈడీపై కేటీఆర్ వ్యాఖ్యలు
-మంత్రి సీతక్క విమర్శలు
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్న దెయ్యం కేటీఆరే కావొచ్చని, చెల్లెలు ఇచ్చిన స్ట్రోక్‌తో ఆయనకు చిన్న మెదడు చితికిపోయిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. సచివాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. ‘గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్‌ను మించిన వారు లేరు... కేటీఆర్.. నీకు గోబెల్ అవారు’్డ ఇవ్వాలనిఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదులపై బీఆర్‌ఎస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు.
కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్ కాదా? అని ప్రశ్నించారు. మోదీ ప్రశంసల కోసమే.. ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. తమ నాయకుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ కేసు బుక్ చేసినట్టు గుర్తుచేశారు.
అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను ఆయన మర్చి నట్టు ఉన్నారని వెల్లడించారు. నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం.. కూలేశ్వరం అయిందో లేదో చెప్పాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. స్వాతం త్య్రం కోసం పోరాడిన పత్రికకు సహా యం చేస్తే తప్పా అని ప్రశ్నించారు.