25-05-2025 01:15:31 AM
ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన స్కిల్స్ లేకపోవడంతో బయటివారికి ఉద్యోగాలు లభి స్తున్నాయని, ఈ కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని, ఇప్పటికే తమ ఆధ్వర్యంలో బర్కత్‌పురాలో ఓ స్కిల్ సెంటర్‌లో మహిళలకు శిక్షణ ఇస్తున్నామని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం అంబర్‌పేట్ పరిధిలోని రత్నానగర్, సత్యనగర్ బస్తీల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు.
అక్కడ నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. ముఖ్యంగా స్కిల్స్ లేకపోవడం వల్లే స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని, బయటి ప్రాంతాల వారు నగరంలో ఉద్యోగాలను దక్కించుకుంటున్నారని చెప్పా రు.
ప్రభుత్వం, నాయకులు, అధికారులు ఈ విషయాన్ని గమనించి యువకులు, మహిళలకు అత్యధిక సంఖ్యలో స్కిల్స్ సెంటర్ల ద్వా రా నైపుణ్యాలను పెంపొందిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే దక్కుతాయ ని సూచించారు. యువత, మహిళలు కూడా తమలోని నైపుణ్యాలను పెంచుకోవడంలో ప్రాధాన్యం ఇవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రత్నానగర్‌లో ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టానని, ప్రస్తుతం బస్తీ జనాభా పరంగా విస్తరించినందున మరో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారని, పనులను పరిశీలించానని వివరించారు.
ఈ బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లు, బస్తీ దవాఖానలు, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగాల్సిన అవసరం ఉం దని, ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిధులను త్వరితగతిన కేటాయిస్తే సదుపాయాల కల్పనలో వేగం పెరుగుతుందని తెలిపారు.