27 August, 2026 | 1:39 PM

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్

20-06-2026 03:29 PM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించారు.   సిరికొండ మండలం, పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జొన్న పంట అమ్ముకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్‌ కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యలులకు మనోధైర్యాన్ని చెప్పారు. అనంతరం రైతు పాండురంగ్‌ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చి,  ఆర్ధిక సాయం అందజేశారు. అంతకుముందు నేరడిగొండ చేరుకున్న కేటీఆర్ కు నేరడిగొండ టూల్ ప్లాజా వద్ద బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం ఘనంగా పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, పాడి కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భూక్యా జాన్సన్ నాయక్ ఉన్నారు.