20 June, 2026 | 4:05 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన

20-06-2026 02:57 PM

దమ్మపేట,(విజయక్రాంతి): హైదరాబాద్‌ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ ప్రాంతంలోని అమెరికన్ కాన్సులేట్ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్అన్నారు. ముఖ్యమంత్రి ఈనిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం  నల్ల జెండాలతో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ... నేడు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి ప్రజల, కార్మికుల మీద యుద్ధాలను, యుద్ధ భారాలను రుద్దుతున్నదనీ, ప్రపంచ ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నదనీ, మనదేశం మీద ట్రంప్ ఆంక్షలు భారత దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ట్రంప్ చర్యలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ సహకారం తోడవటంతో, ఆ చర్యలను ఖండించకుండా, మౌనంగా ఉండటం వల్ల మన దేశం కూడా నష్టపోతున్నదన్నారు. మోడీ ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటకాగుతూ దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వానికి భంగం కల్గిస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ రోడ్ కి ట్రంప్ పేరు పెట్టి తన గురు భక్తి చాటుకుందనీ, బిజెపి బాటలోనే ఈ నిర్ణయం వుండటం అత్యంత ఆక్షేపణీయమని అన్నారు.