ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్తున్నారు. కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలా.? వద్దా? అనే దానిపై బీఆర్ఎస్ అధినేతతో చర్చించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇరువురు చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వచ్చే నెల 16న పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో ఏడు స్థానాలు, తమిళనాడులో ఆరు స్థానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఐదు స్థానాలు, ఒడిశాలో నాలుగు స్థానాలు, అస్సాంలో మూడు స్థానాలు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హర్యానాలో రెండు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఖాలీ అవుతున్న 2 రాజ్యసభ సీట్ల కోసం టీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.




