చేగుంటలో విత్తన మేళా
27-07-2026 02:04 PM
చేగుంట జూలై 27,విజయక్రాంతి: చేగుంట రైతు వేదికలో వ్యవసాయ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం విత్తన మేళా నిర్వహించారు. వరి పంటకు బదులుగా కంది, మొక్కజొన్న, వివిధ కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.అధికారులు ఈ సందర్బంగా తక్కువ నీటితో అధిక లాభాలు పొందే ప్రత్యామ్నాయ పంటల సాగు, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు.






