26 May, 2026 | 1:55 AM

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

26-05-2026 12:25 AM

మాజీ కార్పొరేటర్ దేదీప్య

జూబ్లీహిల్స్, మే 25(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని వెంగళరావునగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ దేదీప్య బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు డివిజన్ పార్టీ కార్యాల యంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు.

దేదీప్య మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ గురించి కార్యకర్తలు, నాయకులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఓట్లను చేర్చడం, తొలగించడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు కేటీఆర్ నియోజకవర్గానికి విచ్చేస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, నాయకుడు సోహైల్ తదితరులు పాల్గొన్నారు.