15 May, 2026 | 11:46 PM

Breaking News

‘ఢావ్లో-గోర్’ రచయితకు సత్కారం

21-06-2024 12:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): ‘ఢావ్లో పుస్తక రచయిత రమేష్ కార్తీక్ నాయక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఎన్ బాలాచారి గురువా రం రమేష్ కార్తీక్ నాయక్‌ను సత్కరించారు. ఈ రచనతో రచయిత బాధ్యత  పెరిగిందని, ఇలాంటి రచనలతో మరింత మునుముందుకు వెళ్లాలని ఆయనను అభినందించారు. కార్యక్రమంలో పునాస సంపాదక మండలి సభ్యుడు రాపోలు సుదర్శన్ పాల్గొన్నారు.