24 August, 2026 | 12:35 AM

10 వేల మందితో కుంకుమార్చన

24-08-2026 12:00 AM
  1. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  2. శ్రీనగర్ కాలనీలో ముగిసిన మహాయజ్ఞం

హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సభా మందిరంలో రెండు రోజులపాటు నిర్వహించిన విద్యా కో టి కుంకుమార్చన మహాయజ్ఞం పూర్ణాహు తి ఘనంగా ముగిసింది. దేశ ప్రగతి, విశ్వశాంతి, పేదల సంక్షేమం లక్ష్యంగా దేశంలోని ప్రముఖ సంత్ స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు,

యువ చేత న జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్ సింగ్ సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మం త్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే హైదరాబాద్‌లో 10 వేల మంది మహిళలతో కుంకుమార్చన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రగతి సుస్థిరమైంది. యువత, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందనితెలిపారు. కార్యక్రమంలో శ్రీదేవి, సుధాకర్ శర్మ, కరాటే కల్యాణి, అనంత లక్ష్మి, రోహిత్ చౌదరి, రాజ్మల్ జైన్  పాల్గొన్నారు.