24 August, 2026 | 1:41 AM

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి

24-08-2026 12:01 AM
  1. ఏపీ సర్కార్ 34% రిజర్వేషన్‌ను స్వాగతిస్తున్నాం 
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణ య్య అన్నారు.  ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే 50 శాతం రిజర్వేషన్ పరిమి తి కారణంగా న్యాయపరమైన అడ్డంకులు ఎ దురయ్యే అవకాశం ఉన్నందున,

సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీలకు జనా భా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా పా ర్లమెంటులో సవరణ తీసుకురావాలని అ న్నారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వాములైన టీడీపీ, జనసేన చొరవ తీసుకు ని, సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని కృష్ణయ్య కోరారు. 50 శాతం పరిమితిని తొలగించేలా రాజ్యాంగ సవరణ జరిగితేనే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత రక్షణ లభిస్తుందన్నారు.