ప్రభుత్వగిరిజన బాలికల హాస్టల్ లో బోనాల పండుగ
23-08-2026 08:26 PM
కోదాడ ఆగస్టు 23,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలో బాలాజీనగర్ లో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల హాస్టల్‌లో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ పద్మతో పాటు విద్యార్థినులు నెత్తిన బోనాలతో అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి పూజలు చేశారు. హాస్టల్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చైతన్య నాయక్, హరి ప్రసాద్, విద్యార్థినులు పాల్గొన్నారు.






