కల్లబొల్లి మాటల కాంగ్రెస్‌ను నమ్మొద్దు
భువనగిరి బీఆర్‌ఎస్ అభ్యర్ధి క్యామ మల్లేశం
యాదగిరిగుట్టలో భారీ ఎన్నికల ర్యాలీ
యాదాద్రి భువనగిరి, మే 9 (విజయక్రాం)/ఎల్బీనగర్ : రాష్ట్ర ప్రజలకు కల్లబొల్లి మాట లు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని భువనగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యం లో పట్టణంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతులను, మహిళలను, బడుగు,బలహీనవర్గాలను ఆదుకుంటామని అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ ప్రస్తుతం కనీస ప్రజాసమస్యలను సైతం పట్టించుకోవడం లేదన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా గతంలో పనిచేసిన కోమటిరెడ్డి సోద రులు, డాక్టర్ బూర నర్సయ్య ప్రజాసమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. బడుగు బలహీనవర్గాల బిడ్డగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి పార్ల మెంట్ పరిధిలోని సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ ర్యాలీలో డీసీసీబీ చైర్మన్ గొంగి డి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ పరిధిలో జోరుగా
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ విస్తృతంగా పర్యటించారు. బీజేపిని కొత్తపేట, నాగోల్, చంపా పేట, హయత్‌నగర్ డివిజన్లలో ఓటర్లను కలుసుకున్నారు. తనను గెలిపించాలని కోరారు. హయత్‌నగర్ గిరిజన బస్తీల్లో ఓట్లు అభ్యర్థించారు. బీజేపీతోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. పదేండ్లుగా మోదీ హయాంలో భారతదేశం సుస్థిరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓట్ల కోసం అనేక మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటి మాటలు నమ్మొద్దని హిత వుపలికారు. బీజేపీని గెలిపించాలని కోరారు. ఈటెల వెంట ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు నాయికోటి పవన్‌కుమార్, కొప్పుల నర్సింహరెడ్డి, లచ్చిరెడ్డి, నవజీవన్‌రెడ్డి, బీజేపీ నాయకులు మంచి రాజేశ్, గీతారెడ్డి, అం బాల మల్లేశ్, స్వామి, సుందర్‌నారాయణ, అశ్విన్‌సింగ్, కొత్త తిరుమల, మోతీలాల్‌నాయక్, రవినాయక్, శివచారి, జంగయ్య, మల్లేశ్‌యాదవ్, మహేశ్, బాలు తదితరులు పాల్గొన్నారు.






