రేపు కామారెడ్డికి ప్రియాంకగాంధీ
కేరళ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్
కామారెడ్డి, మే 9 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శని వారం కామారెడ్డి జనజాతర సభకు రానున్న ప్రియాంకగాంధీ సభను విజయవంతం చేయాలని కేరళ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్ తెలిపారు. గురువారం కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో సభాస్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని ఉన్నితన్ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ పాలనలో ప్రజ ల కష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. దేశ సంపద అప్పజెప్పి అదా నీ, అంబానీలను ప్రపంచ కుబేరులను చేసిందని బీజేపీపై మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ ఖాళీ కావడం ఖాయమని చెప్పారు. ప్రధా నమంత్రి మోదీకి గెలుస్తామో? లేదో?అన్న భయం పట్టుకున్నదని ఎద్దేవాచేశారు.






