6 April, 2026 | 8:48 PM

Breaking News

గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణకు ‘ఉత్తమ గైనకాలజిస్ట్’ అవార్డు   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ చేసిన సర్పంచ్ పగడాల రమాదేవి   •   రాఘవపేట గ్రామంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం   •   మిత్రుడి కుటుంబానికి అండగా మిత్ర బృందం   •   భాగ్యనగర్ తండా, అప్పాయిగూడెంలో హైమాస్ట్ లైట్లు మంజూరు   •   బొల్లారం గ్రామంలో కబడ్డీ డ్రెస్ కోడ్ పంపిణీ   •   సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి భూమి పూజ   •   ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సహకారం   •   రోడ్డుపై ప్లాస్టిక్ వ్యర్థాలు వేసినందుకు భారీ జరిమానా   •   ఘనంగా బిటి రణదీవే వర్ధంతి   •  

కార్పొరేట్ కు దోచిపెట్టటానికే లేబర్ కోడ్ లు

06-04-2026 07:21 PM

కారేపల్లిలో బీటీ రణదీవే, ఎర్ర శ్రీకాంత్ వర్ధంతులు

కారేపల్లి,(విజయక్రాంతి): కార్మికుల కష్టాన్ని కార్పొరేట్ కు దోచి పెట్టడానికే మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర అన్నారు. సోమవారం కారేపల్లిలోని హమాలీ అడ్డలో సీఐటీయు నేతలు బీటీ రణదీవే, ఎర్ర శ్రీకాంత్ ల వర్ధంతిని నిర్వహించారు. అమరుల చిత్రపటాలను పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఐక్యత – పోరాటం నినాదంతో 1970లో ఏర్పడిన సీఐటీయూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు.

కార్మికోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో బీటీఆర్ చేసిన సేవలు అమోఘమన్నారు. ఖమ్మం జిల్లాలో సీఐటీయు విస్తరణకు ఎర్ర శ్రీకాంత్ ఎంతో కృషి చేశారన్నారు. పని గంటల పెంపు, కనీస వేతనాల అమలు, సంఘం ఏర్పాటు హక్కు, సమ్మె హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు కార్మికులను బలి పశువులుగా మార్చే విధానాలకు వ్యతిరేకంగా బీటీ రణదీవె, ఎర్ర శ్రీకాంత్ చూపిన పోరాట బాటలో నడవాలని పిలుపునిచ్చారు.