28 June, 2026 | 2:08 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

కార్మిక చట్టాలను వినియోగించుకొవాలి: జడ్జి దుర్గం గణేశ్

04-05-2026 06:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలనువినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు.  మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా  జడ్జి గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర కార్మికులు తప్పనిసరిగా కార్మిక గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. ఈ గుర్తింపు కార్డు లతో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. పలువురు న్యాయవాదుల కార్మిక చట్టాల గురించి వివరించారు. అనంతరం సీనియర్ కార్మికున్ని జడ్జి గణేష్ శాలువతో సత్కరించారు.