10న లేబర్ ఆఫీస్ ముట్టడి
ఆర్టీసీ జేఏసీ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఈనెల 10న లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని, పీఆర్సీ అమలుచేయాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిందని పేర్కొన్నారు.
సమ్మెకు సంబంధించి కార్మిక శాఖ మధ్యవర్తిత్వం ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్‌చైర్మన్ ఎం.థా మస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.




