దళారుల దందా
- 200 ఎకరాల కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్‌రెడ్డి కన్ను
- రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర
- నిర్మాణానికి స్థలంతో పాటు రూ. 350 కోట్లున్నా పనులెందుకు చేయడం లేదు?
- కోర్టు వివాదాల్లో ఉన్న ‘దిల్’ భూములను ప్రత్యామ్నాయంగా ఎలా ఇస్తారు?
- రాందాస్‌పల్లిలో 1200 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు
- ఫ్రూట్ మార్కెట్ కోసం రైతుల పక్షాన పోరాడుతాం
- మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) : ప్రతిరోజు 25 నుంచి 30 వేల మంది రైతులకు ఉపయోగపడే కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ భూములను దళారుల కోసం అమ్మేస్తారా అని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల భవిష్యత్తు ముఖ్యమా ? నలుగురు ఐదుగురు వ్యాపారులు, దళారులకు కట్టబెట్టడం ముఖ్యమా అని ఆయన నిలదీశా రు. ఈ సమస్య బీఆర్‌ఎస్ పార్టీదో, కాంగ్రె స్ పార్టీదో కాదని, ఇది రైతుల సమస్య అన్నారు.
ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పనిచేయాలి.. దళారుల కోసం కాదని హితవు పలికారు. దళారుల కోసం కాకుండా లక్షలాది మంది రైతుల కోసం ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు సూచించారు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో ట్రాఫిక్ తగ్గించడానికి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 200 ఎకరాల్లో ఈ మార్కెట్ ను నిర్మించాలని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయిం చిందని గుర్తు చేశారు.
తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నపుడు మంచిరెడ్డి కిష న్‌రెడ్డి నాతో కొట్లాడి రూ.10 కోట్లను ఫ్రూట్ మార్కెట్ కోసం చేసిన భూసేకరణలో భాగంగా ఇక్కడ రైతులకి ఇప్పించా రని తెలిపారు. రైతులకు డబ్బులిచ్చి 178 ఎకరాలు సేకరించామని, పక్కనే ఉన్న 22 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా కలిపి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నామని చెప్పారు.
అందులో భాగంగానే 2020 సంవత్సరంలో జీవో 11 ద్వారా ఈ మార్కెట్‌ను నోటిఫై చేశామని పేర్కొన్నారు. సోమవారం కోహెడ మార్కెట్‌ను హరీష్‌రావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితర నాయకులు పాల్గొనారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ హయాం లో జీవో 216 ప్రకారం రూ.350 కోట్ల డబ్బులను మార్కెట్ కోసం బ్యాంక్ అకౌం ట్లో ఉంచడంతోపాటు ఎలా కట్టాలని అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లతో ప్లాన్ కూడా చేశామని గుర్తుచేశారు. రూ.1,000 కోట్ల ప్రణాళికతో డీపీఆర్ తయారుచేశామన్నారు. భవిష్యత్‌లో ఇక్కడే ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్ రావాలని తీర్చిదిద్దామని, 100 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌కు రూపకల్పన చేశామన్నారు.
అమ్మడమే పనిగా పెట్టుకున్నారు..
డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్, ప్లాన్ అంతా రెడీగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పని ముందుకు తీసుకపోకపోగా ఈ భూమిని అమ్మాలని, మింగే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఈ భూమి దాదాపు 3 వేల కోట్ల విలువ ఉందని, ఈ భూమిని టీజీఐఐసీకి ఇచ్చి తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేరళ నుంచి ఎవరో వచ్చారని, లీలా హోటల్‌లో చాలా లీలలు జరిగాయని తెలుస్తోంది.
వారు వచ్చి ఈ భూమిని చూసి వెళ్లారని సమాచారం ఉందన్నారు. ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దక్కన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూముల్లో మార్కెట్ కట్టిస్తామంటున్నారని.. కానీ ఆ భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. అందు లో మాకు వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్లాడుతుందన్నారు. దిల్ భూ ములు వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు.
ఇది మాత్రం అమ్ముకొని దొబ్బతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ భూముల్లో ఎన్నో పంచాయితీలున్నాయని, అక్కడ ఇస్తామంటున్న 233 ఎకరాల్లో 33 ఎకరాలు ఓఆర్ ఆర్ కింద పోయిందన్నారు. 25 ఎకరాల్లో గుడి ఉందని, అక్కడ నుంచే రోడ్డు పోవడంతోపాటు అందులోనే 4 ఎకరాల్లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉందన్నారు. దీనికి తోడు ఆ భూముల్లోనే 40 నుంచి 50 ఎకరాల్లో ఎస్సీ రైతులు పంట పండించుకుంటున్నారని తెలిపారు.
ఇన్ని కిరికిరిలతోపాటు హౌసింగ్ బోర్డు వారు రూ. 1500 కోట్లు కట్టాలని మార్కెట్ శాఖను అడుగుతున్నారని చెప్పారు. మార్కెట్‌కు మంగళం పాడి భూములు ఖతం చేయాలని చూస్తున్నారని, ఈ భూములను బకాసురుల పరం చేసే కార్యక్రమిదని స్పష్టంచేశారు. అలాంటి భూ మి ప్రత్యామ్నాయంగా ఇస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి భూ ముల మీద కన్నుపడిందని, రేవంత్‌రెడ్డి భూముల చుట్టే తిరుగుతూ ఎక్కడ కనిపించినా మాయం చేస్తున్నారని మండిపడ్డారు.
రైతుల పక్షానా.. దళారుల క్షానా..?
సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షాన ఉంటా రా, లేక దళారుల పక్షాన ఉంటారా అని నిలదీశారు. నీ కమీషన్ల కోసం రైతుల భూము లు కూడా వదిలిపెట్టరా అని ప్రశ్నించారు. కబ్జాలకు కాదేదీ అనర్హం అన్నట్లు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ మార్కెట్ భూములపై కన్నుపడిందని విమర్శించారు. కూరగాయలు, పండ్లు పండిం చే రైతుల కోసం ఉన్న మార్కెట్ భూమిని అమ్మేస్తారా, కబ్జా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మార్కెట్ నిర్మాణాన్ని ఆపే కుట్ర జరుగుతున్నదని, అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మార్కెట్ వచ్చేదాకా బీఆర్‌ఎస్ కోట్లాడుతుందని స్పష్టంచేశారు.




