7 April, 2026 | 3:41 AM

స్టార్టప్, నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణ దూకుడు

07-04-2026 01:54 AM

టీబూ టాస్క్, వీబూ ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతం

  1. గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా రాష్ట్రం
  2. పరిశ్రమలతోపాటు నైపుణ్యాధారిత ఆర్థిక వ్యవస్థపై దృష్టి
  3. స్టార్లప్‌లకు దీర్ఘకాలిక ఫండింగ్, ద్వితీయ శ్రేణి నగరాల్లో అవకాశాల విస్తరణ వంటి సవాళ్లు
  4. అధిగమించేలా ప్రభుత్వం చర్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతికరంగాల్లో తెలంగాణ ప్రదర్శిస్తున్న దూకుడు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచస్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నది. టీ టాస్క్, వీహూ-హబ్ వంటి కీలక సంస్థల సమన్వయంతో రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తుండగా, హైదరాబాద్ ప్రపంచస్థాయి స్టార్టప్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నది.

పరిశ్రమల అభివృద్ధిని మాత్రమే కాకుండా, స్కిల్స్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా దృష్టి సారించడం వల్ల యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. విద్య నుంచి ఉపాధి వరకు నిరంతర శ్రేణిగా స్కిల్ డెవలప్‌మెంట్ అనుసంధానం చేయడం తెలంగాణ మోడల్‌కు ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నది. అదే సమయంలో మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం, హాకథాన్లు, డీప్‌టెక్ రంగాల అభివృద్ధి, ఇండస్ట్రీ- అకాడమీయా భాగస్వామ్యాలు రాష్ట్రాన్ని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా నిలబెట్టే దిశగా ముందుకు నడిపిస్తున్నాయి.

అయితే స్టార్టప్లకు దీర్ఘకాలిక ఫండింగ్ సవాళ్లు, ద్వితీయ శ్రేణి నగరాల్లో అవకాశాల విస్తరణ అవసరం, గ్లోబల్ పోటీకి సరిపోయే నైపుణ్యాల పెంపు వంటి అంశాలు ఇంకా కీలకంగా మిగిలి ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలు, ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించడంతో తెలంగాణ సమగ్రంగా ఇన్నోవేషన్, స్కిల్స్, స్టార్టప్‌ల కేంద్రంగా అవతరించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.

టీహూ-హబ్‌తో స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ

తెలంగాణలో స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి టీహూహబ్ కీలకంగా నిలుస్తున్నది. ప్రభు త్వం, పరిశ్రమలు, అకాడమిక్ సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తూ స్టార్టప్‌లకు సమగ్ర మద్దతు అందించే వేదికగా ఇది మారింది. ప్రపంచస్థాయి మౌలి క సదుపాయాలు, మెంటరింగ్, నెట్‌వర్కింగ్ అవకా శాలతో స్టార్టప్‌లను ప్రారంభ దశ నుంచి వృద్ధి దశ వరకు తీసుకెళ్లడంలో టీ- ముఖ్య పాత్ర పోషిస్తున్నది.

ప్రత్యేకంగా డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌టెక్, ఫిట్‌నెక్ వంటి రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు అవసరమైన టెక్నికల్ సపోర్ట్, వ్యాపార వ్యూహాల మార్గదర్శనం, గ్లోబల్ మార్కెట్లకు కనెక్టివిటీ అందిస్తున్నది. పెట్టుబడిదారులతో నేరు గా అనుసంధానం కల్పించడం ద్వారా ఫండింగ్ అవకాశాలను కూడా విస్తరిస్తున్నది. గ్లోబల్ సంస్థలతో భాగస్వామ్యాలు,

ప్రత్యేక ఇంక్యూబేషన్ ప్రోగ్రాం లు, యాక్సిలరేషన్ కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్టార్టప్ మ్యాప్‌పై నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం, విఫలమైనా మళ్లీ ప్రయత్నించే సంస్కృతి (ఇన్నోవేషన్ కల్చర్) ఏర్పడటంలో కూడా టీళూ-హబ్ కీలకపాత్ర పోషిస్తున్నది. తెలంగాణను కేవలం ఐటీ కేంద్రంగా కాకుండా ఇన్నోవేషన్, స్టార్టప్‌ల గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా బలమైన పునాది వేస్తున్నది.

వీబూ ద్వారా మహిళల ఆర్థిక సమానత్వం

తెలంగాణలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా వీబూ కీలకపాత్ర పోషిస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి, స్టార్టప్ రంగాల్లో ముందుకు రావడానికి అవసరమైన శిక్షణ, మార్గదర్శకం, ఫండింగ్ యాక్సెస్ వంటి అంశాల్లో సమగ్ర సహకారం అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బూట్ క్యాంప్ లు, మెంటరింగ్ సెషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాల ద్వారా మహిళల్లో వ్యాపార చైతన్యం పెరుగుతున్నది. చిన్నస్థాయి వ్యాపారాల నుం చి టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌ల వరకు మహిళలు అడుగుపెడుతూ, ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.

ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు కూడా అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నది. వ్యాపార ఆలోచనను మార్కెట్‌లోకి తీసుకెళ్లే వరకు పూర్తిస్థాయి మద్దతు అందించడం వీళూహబ్ ప్రత్యేకత. ఫైనాన్షియల్ లిటర సీ, మార్కెటింగ్ నైపుణ్యాలు, లీడర్‌షిప్ ట్రైనిం గ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళలను విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతున్నది.

మహిళా ఎంట్రప్రె న్యూర్షిప్ పెరగడం కేవలం వ్యక్తిగత ఆదాయాన్ని మాత్రమే కాకుండా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీని ప్రభావం సమాజంపై కూడా కనిపిస్తూ, లింగ సమానత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఉద్యోగాల సృష్టి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపే తం వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 

హ్యాకథాన్‌లతో ఇన్నోవేషన్ కల్చర్‌కు పునాది

తెలంగాణలో ఇన్నోవేషన్ సంస్కృతిని పెంపొందించడంలో హాకథాన్లు కీలక వేదికగా మారాయి. ముఖ్యంగా టాస్క్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాకథాన్లు విద్యార్థులు, యువ ఇంజినీర్లలో సృజనాత్మకతను వెలికితీస్తున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వందలాది టీము లు పాల్గొంటూ, పరిశ్రమల ముందు ఉన్న సమస్యలకు కొత్త పరిష్కారాలను సూచిస్తున్నాయి.

ఇండస్ట్రీ- అకాడమియా భాగస్వా మ్యంతో నిర్వహించే హాకథాన్లు విద్యార్థులకు ప్రత్యక్ష పరిశ్రమ అనుభవాన్ని అందిస్తున్నా యి. కంపెనీలు తమ రియల్ టైమ్ సమస్యలను విద్యార్థుల ముందుంచి, వాటికి పరిష్కారాలు కోరడం ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో టీమ్‌వర్క్, టైమ్ మేనేజ్మెంట్, ఇన్నోవే టివ్ థింకింగ్ వంటి కీలక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి.

హాకథాన్లు తెలంగాణ లో స్టార్టప్ కల్చర్‌కు పునాది వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సెమీకండక్టర్లు, ఫోటానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ, ఐవోటీ, క్వాంటం టెక్నాలజీల వంటి రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో ఫొటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ పనిచేస్తున్నది. ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని బలోపేతం చే యడం ఫోటానిక్స్ వ్యాలీ ప్రధానలక్ష్యం. ప్రముఖ టెక్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తున్నది.

కాన్‌క్లేవ్‌లు, వర్క్ షాపులు, టెక్నికల్ సెషన్ల ద్వారా భవిష్యత్ టెక్ ట్రెండ్‌లను విద్యార్థులకు పరిచయంచేస్తున్నది. ప్రత్యేకంగా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఫోటానిక్స్ వ్యాలీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంది. గ్లోబల్ సరఫరా గొలుసులో భారత్ స్థానం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నది. 

స్కిల్ డెవలప్‌మెంట్‌లో గేమ్ ఛేంజర్

తెలంగాణలో యువత ఉపాధి అవకాశాలను విస్తరించడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) కీలక భూమిక పోషిస్తున్నది. విద్యావ్యవస్థలో పొందిన సిద్ధాం త జ్ఞానాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలుగా మలచడంలో టాస్క్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలతో అనుసంధానం ఏర్పరుచుకుని విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,

సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్‌సాల్వింగ్ అంశాల్లో శిక్షణ అందిస్తున్నది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తూ ఇండస్ట్రీ డిమాండ్‌కు సరిపోయే మానవ వనరులను తయారుచేస్తున్నది. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, విద్య నుంచి ఉద్యోగం వరకు పూర్తిలింకేజ్‌ను టాస్క్ కల్పిస్తుంది.

జాబ్ డ్రైవ్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా వేల మంది విద్యార్థులకు నేరుగా ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రాంతీయ అసమా నతలను తగ్గించే దిశగా పనిచేస్తున్నది. టాస్క్ వల్ల తెలంగాణలో స్కిల్ గ్యాప్ గణనీయంగా తగ్గుతున్నది. ఇతర రాష్ట్రాల్లో కనిపించే డిగ్రీ ఉన్నా ఉద్యోగం లేని పరిస్థితిని అధిగమించడంలో ఇది కీలకంగా మారింది. పరిశ్రమలు కూడా తక్షణమే ఉపయోగపడే నైపుణ్యాలతో కూడిన ఉద్యోగులను పొందుతున్నాయి.

సవాళ్లను అధిగమించేలా చర్యలు 

స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ అమలుచేస్తున్న మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఆయా సంస్థల సమన్వయంతో ప్రభుత్వం ఇన్నోవేషన్, స్కిల్స్, ఇండస్ట్రీ అనే సమగ్ర దృక్పథాన్ని అమలుచేస్తున్నది. ఈ మోడల్ ద్వారా విద్య నుంచి ఉపాధి వరకు నిరంతర అనుసంధానం, స్టార్టప్‌లకు అవసరమైన మద్దతు, మహిళలు, గ్రామీణ యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు, గ్లోబల్ కంపెనీలు, అకాడమిక్ సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేస్తున్నది.

అయితే, ఈ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌లకు దీర్ఘకాలిక ఫండింగ్ అందుబాటు ఇంకా పరిమితంగానే ఉండటం, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవకాశాలు విస్తరించాల్సిన అవసరం, గ్లోబల్ స్థాయి పోటీకి సరిపోయే నైపుణ్యాల పెంపు వంటి అంశాలు ప్రధానంగా నిలుస్తున్నాయి. ప్రారంభ దశలోనే చాలా స్టార్టప్‌లు ఫండింగ్ లోపంతో నిలిచిపోవడం కూడా ఒక సమస్యగా మారుతున్నది.

ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీలు, ఇన్సెంటివ్‌లు తీసుకురావడం, కొత్త ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటుచేయడం, ద్వితీయ శ్రేణి నగరాల్లో స్కిల్ సెంటర్ల విస్తరణ, ఇండస్ట్రీ- భాగస్వామ్యాల పెంపు వంటి చర్యలు అమలుచేస్తున్నారు. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్లకు స్టార్టప్‌లను అనుసంధానం చేసే కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.