13-02-2026 12:13:08 AM
సమ్మెతో స్తంభించిన చర్లపల్లి
పారిశ్రామికవాడలో పనులు నిలిపివేత..
కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, కుషాయిగూడ/జవహర్‌నగర్/శేరిలింగంపల్లి/మేడిపల్లి/సికింద్రాబాద్/ఎల్బీనగర్ , ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తు న్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా బాగ్ లింగంపల్లిలో గురువారం నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని నాలుగు శ్రామిక నియమావళిగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
శీతాకాల పార్లమెంటు సమావేశాల ముగింపు సమయంలో అత్యంత వేగం గా ఈ ఉత్తర్వులను జారీ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో పోరాటాలను మరిం త ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించా రు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు కార్యకర్త లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు చర్లపల్లి పారిశ్రామికవాడలో విస్తృత స్పందన లభించింది. వివిధ పరిశ్రమల కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీం వర్కర్లు పెద్దఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల పని నిలిపివేతతో పరిశ్రమల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి.
ఈ సందర్భంగా నిర్వహిం చిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బి.వి.సత్య నారాయణ, సిఐటియు మేడ్చల్ జిల్లా నాయకులు ఎం.శ్రీనివాస్ రావు, కొండల్ రెడ్డి, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకులు, గండూరి ఫుడ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ రెడ్డి, ఎస్ పిఎం పవర్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.నరసింహా, టికిల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.బాలరాజ్, శివఫ్రా క్రేన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్, ఆశీష్ క్రేన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, హైక్యూబ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.సంతోష్, 3డి ఫోమ్ కట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.ఆదాం, టికిల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.నాగేశ్వరరావు కార్మికులతో పాటు పెద్ద సంఖ్యలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.
* నాలుగు లేబర్ కోడ్లు అమలైతే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది అన్ని ఏఐటియుసి కార్యదర్శి ఎం నరసింహ అన్నారు. కేం ద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ గురువారం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లి డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ వెజిటేబుల్ మార్కెట్‌లో జెండాలతో హమాలీ యూనియన్ కార్మిక హక్కుల పరిరక్షణస కోసం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ,సభ్యులు ఏఐటీయూసీ కార్మిక నాయకులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
* సార్వత్రిక సమ్మెలో ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన సెగ చూపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లో దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకొని గురువారం ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షేక్షావలి, బీఆర్డీయూ, సీపీఐ, సీఐటీయూ, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి
* కాంగ్రెస్ వామపక్షాల ఆధ్వర్యంలో...
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక, కార్మిక విధానాలు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని టీపీసీసీ కార్యదర్శి సామెల్ కార్తీక్ విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ, సీపీఎం, ఐఎన్టీయూసీ, లేబర్ సెల్ కర్షక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
* బోడుప్పల్ సర్కిల్‌లో..
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో గురువారం జిహెచ్‌ఎంసీ పరిధి బోడుప్పల్ సర్కిల్‌లోని బోడు ప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు సమ్మెలో పాల్గొని, పెద్ద ఎత్తు న ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండ ల కార్యదర్శి ఎన్ సృజన, సిఐటియు జిల్లా నాయకులు చింతల యాదయ్య, సబిత, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బాల నరసింహ పాల్గొన్నారు.
* ఎల్బీనగర్ నియోజకవర్గంలో...
దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో విజయవంతమైంది. ఏఐటీయూసీ, సీఐఎన్టీయూసీ, కేకేసీ, వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వనస్థలిపురం - ఆటోనగర్‌లో రవాణా రంగం కార్మికులు కార్మిక వ్యతిరేక జీవో పత్రులను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజ మానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, న్యూ లారీ ఆటోనగర్ అధ్యక్షుడు జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ అర్బన్ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఎల్బీన గర్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్‌రెడ్డి, ఏఐటీ యూసీ ఎల్బీనగర్ అధ్యక్షుడు బోయపల్లి రాములు గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో వృత్తి సంఘాల రాష్ట్ర నాయకుడు బొడ్డుపల్లి కృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీవర్ధన్ రెడ్డి, జిల్లా కౌన్సి ల్ సభ్యుడు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, హయత్ నగర్ మండల కార్యదర్శి శేషరాజు పల్లి శ్రీదేవి పాల్గొన్నారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్ నుంచి హస్తినాపురం చౌరస్తా వరకు కార్మికులు ర్యాలీ నిర్వ హించారు.
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపి నాయక్ ఆధ్వర్యం లో ఆర్కేపురం లేబర్ అడ్డా దగ్గర భవన నిర్మా ణం కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు కట్ట శ్రీనివాస్, వెంకన్న, వీరయ్య, ఎండీ లతిఫ్ పాల్గొన్నారు.