15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ట్రంప్ టారిఫ్‌ల షాక్: స్టాక్ మార్కెట్ భారీ పతనం, రూ.3.33 లక్షల కోట్ల సంపద ఆవిరి

25-02-2026 01:30 AM

పడిపోయిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ కొత్త టారిఫ్‌ల ఎఫెక్ట్

ముంబై, ఫిబ్రవరి ౨౪: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న కొత్త సుంకాలు మదుపర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ.3.33 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మొదలవుతుందనే ఆందోళనల నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కూడా 288 పాయింట్లు నష్టపోయి 25,425 పాయింట్లకు పడిపోయింది. ఫలితంగా టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి అగ్రశ్రేణి సంస్థల షేర్లు 6 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు నష్టపోయారు. బ్యాంకింగ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు సైతం నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఐటీ రంగంలో అస్థిరత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.