1.47 లక్షల మంది ‘బడిబాట’
22-06-2024 12:05 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ నెల 6 నుంచి 19 వరకు చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు ఒకటి నుం చి పదోతరగతి వరకు మొత్తం 1,47,103 మంది అడ్మిషన్లు పొందారు. 19,072 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లో చేరారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం బడిబాట పూర్తి వివరాలను వెల్లడించింది. కాగా, ఒకటో తరగతిలో 70,116 మందికి అడ్మిషన్లు కల్పించారు.






