హౌసింగ్ బోర్డు రోడ్డుకు రూ.49 లక్షలు మంజూరు
మేడ్చల్ అర్బ న్, జూలై 20 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో ని హౌసింగ్ బోర్డ్ కాలని నుండి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వరకు రూ .49 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి అనుమతి లభించింది. మున్సిపాలిటీ మాజి వైస్ చైర్మన్ చీర్ల రమేష్ చేసిన నిరంతర కృషి,పట్టుదల వల్లే కీలకమైన అభివృద్ధి పనికి మోక్షం లభించిందని పలువురు ఆయనను అభినందించారు.
స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన సంబంధిత అధికారులతో పలుమార్లు సమావేశమై, నిరంతరం కృషి చేయడంతో విధులు మంజూరయ్యాయి. 297వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలని నుండి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాల యం వరకు కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం 3 నెలల్లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా రోడ్డు సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతోనే తానే స్వయంగా అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించానని కృషికి ఫలితంగానే రూ.49 లక్షల నిధులు మంజూరయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.






