అనురాగ్‌లో ‘యూత్ ఎంపవర్మెంట్’ అంశంపై వర్క్‌షాప్
ఘాట్ కేసర్, జూలై 20 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలోని ఐఈఈఈ ఎస్‌ఎస్‌ఐటీ స్టూడెంట్ చాప్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో టాస్క్, సింక్రోనీ ఎపిఈఎన్ సహకారంతో ‘యూత్ ఎంపవర్మెంట్‘ అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు స్టాన్లీ డి’క్రూజ్ సారి సిన్హా యువతలో నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, ఉపాధి నైపుణ్యాలు, వృత్తి అవకాశాలు, సామాజిక బాధ్యతపై విలువైన సూచనలు అందించారు.
ఈకార్యక్రమంలో డాక్టర్ జి. ఎల్. ఆనంద్ బాబు, ఐఈఈఈ ఎస్‌ఎస్‌ఐటి ఫ్యాకల్టీ అడ్వైజర్, డాక్టర్ నితీషాశర్మ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి, జి. శేఖర్ రెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ (ఎంసీఏ) పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువత సమగ్ర అభివృద్ధికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం తరఫున ప్రముఖ వక్తలు స్టాన్లీ డి’క్రూజ్, సారి సిన్హాలను జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.






