21 March, 2026 | 10:54 AM

58 లక్షల ఓట్లు ఔట్!

16-12-2025 01:41 AM
  1. పశ్చిమ బెంగాల్‌లో 14న ముగిసిన ‘సర్’ 
  2. నేడు సవరించిన ఓటర్ల జాబితా ప్రకటన

కోల్‌కతా, డిసెంబర్ 15: పశ్చిమ బెంగాల్ లో ఓటర్ల జాబితా నుంచి 58 లక్షలకు పైగా ఓట్లను తీసేందుకుఎన్నికల కమిషన్ సిద్ధమైం ది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 58 లక్షలకు పైగా గణన ఫారాలు సేకరించలేనివిగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 58,17,851 ఫారాలు సేకరించనివిగా గుర్తించబడ్డాయి. ఈ ఓటర్ల పేర్లను తాత్కాలికంగా ముసాయిదా జా బితా నుంచి తొలగిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 92.41% ఓటర్ల ఫారాలు డిజిటలైజ్ చేయబడ్డాయి.

7,66,86,658 ఓటర్ల ఫారాల్లో 7,06,98,649 డిజిటలైజ్ చేయబడ్డాయి. ప్రస్తుతం కమిషన్ 99.99% ఓటర్ల సమాచారాన్ని అందుకుంది. కాగా రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా యి. దీంతో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ(సర్) జరుగుతోంది. ఓట రు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తదితర కారణాల దృష్ట్యా వీరి పేర్లను తొలగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.

అలాగే సవరించిన ఎలక్టోరల్ రోల్స్‌ను మంగళవారం ప్రజల ముందుకు తీసుకురానున్నారు. కాగా రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నవంబర్ 4 నుంచి ప్రారంభించారు. మొత్తం నెల రోజుల్లో సర్వేను పూర్తి చేయాల్సి ఉండగా మొదట వారం రోజులు, మరోసారి మూడు రోజులు సర్వే గడువును పొడిగించారు. ఆదివారంతో సర్ కార్యక్రమం ముగి సింది. మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత.. ఓటర్ల మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలపడానికి నేటి నుంచి జనవరి 17వ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇవ్వనుంది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫ్రిబవరిలో ప్రచురిస్తారు.