16-12-2025 01:42:45 AM
మెస్సీ పర్యటన రోజు కుర్చీలు ధ్వంసం చేసిన నిందితులు
కోల్‌కతా, డిసెంబర్ 15 : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా శనివారం కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించినందుకు గాను శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోం దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.