18 April, 2026 | 6:09 PM

లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం

13-05-2025 12:00 AM

హాజరైన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్, మే 12 (విజయక్రాంతి): దిలవార్ పూర్ మండలం కాల్వ గ్రామంలో శ్రీ లక్ష్మ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్స వం సోమవారం కన్నుల పండువగ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,  సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించా రు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు హాజరయ్యా రు.

ముందుగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దం పతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నా రు. రాష్ర్ట ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, రైతులకు మే లు జరగాలని, యుద్ధ భూమిలో గల భారత సైనికులకు ఆత్మ స్థుర్యైం, విజయం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చైర్మ న్ మహేందర్ రాంనాథ్, ముత్యంరెడ్డి, వీరే ష్, చంద్రకాంత్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, నర్సయ్య, నాయకులు రమణ, శ్రీకాంత్ రెడ్డి, భూపతి రెడ్డి, మధు, నరేష్ రెడ్డి, నరేష్, నిరంజన్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి తదితరులున్నారు.

బుద్ధుడి మార్గం ఆచరణీయం

గౌతమ బుద్ధుడి మార్గం ఆచరణీయమని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని బుద్ధ విహార్ భవన్‌లో నిర్వహించిన బుద్ధ పౌర్ణమి వేడుకలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. గౌత మ బుద్ధుడు బోధనలు సామాజిక స్పృహ నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార్ ట్రస్ట్ నాయకులు వెంకటస్వామి గంగాధర్ ప్రభాకర్ డి రాములు తదితరులు పాల్గొన్నారు.