calender_icon.png 13 May, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ ఎక్సేంజ్‌లో ‘తెలంగాణ’ కుదువ

13-05-2025 12:00:00 AM

  1. లక్షా75వేల ఎకరాల భూములను తాకట్టుపెట్టే కుట్ర
  2. కాంట్రాక్టర్ల నుంచి 20శాతం కమీషన్ తీసుకుంటున్న సీఎం
  3. రేవంత్‌రెడ్డి సొంత ఖజానాకు రూ.20వేల కోట్లు
  4. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 16 నెలలపాలనలో లక్షా 80వేల కోట్ల అప్పులు తెచ్చిందని, ఈ అప్పుల్లో 80వేల కోట్లు మాత్రమే తిరిగి చెల్లించిందని, మిగతా లక్ష కోట్ల రూపాయలను రేవంత్‌రెడ్డి భారీఎత్తున కమీషన్లు తీసుకొని బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది 20శాతం కమీషన్ సర్కార్ విమర్శించారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్‌రెడ్డి కమీషన్లు రూపం లో రూ.20వేల కోట్లకు పైగా సొమ్ము తన సొంత ఖజానాకు చేర్చుకున్నారని ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతోనే మాట్లాడు తున్నట్లు చెప్పారు. తాను చెప్పేది అబద్ధమైతే అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లా డుతూ..

తెలంగాణ భూములను సీఎం రేవంత్‌రెడ్డి స్టాక్ ఎక్సేంజ్‌లో కుదవబెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. లక్షా 75వేల ఎకరాల టీజీఐఐసీ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంస్థ టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రేవంత్‌రెడ్డి రహస్య జీవో విడుదల చేసిందన్నారు.

టీజీఐఐసీ హోదాను మార్చడం ద్వారా రూ.వేల కోట్ల అదనపు రుణాలు సేకరించాలన్నదే సీఎం ఎజెండాగా ఉందని విమర్శించారు. టీజీఐఐసీ హోదాను మార్చిన విషయం ప్ర జలకు చెప్పకుండా ఎందుకు దాచారని కవిత ప్రశ్నించారు. టీజీఐఐసీ పబ్లిక్ లిమిటె డ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

పనిగట్టుకొని నాపై దుష్ప్రచారం.. 

తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా అని, ఇంకా నన్ను కష్టపెడతారా అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానన్నారు.

తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నట్లు కవిత తెలిపారు. తాను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నట్లు చెప్పారు. 47 నియోజకవర్గాల్లో తాను చేసిన పర్యటనల్లో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్థావించానని వివరించారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని చెప్పారు.