calender_icon.png 13 May, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సేవలో నర్సులు కీలకం

12-05-2025 11:30:02 PM

తొర్రూరు: వైద్య సేవల్లో నర్సుల పాత్ర ప్రముఖమైందని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ రోగుల సేవలో తరించిన మహోన్నత వ్యక్తి నైటింగేల్‌ అన్నారు.

ఆమె చేసిన సేవలకు గుర్తుగా నైటింగేల్‌ జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. నర్సింగ్‌ వృత్తి కాదని, అదొక బాధ్యత అని, నర్సింగ్‌ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ధన్యులన్నారు. డాక్టర్ల కంటే నర్సులే రోగికి అవస రమైన సేవలందించడంలో  కీలకమన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి జ్వలిత , మీరాజ్, ప్రియాంక, మానస, శంకర్ తదితరులు పాల్గొన్నారు.