calender_icon.png 12 May, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ

11-05-2025 11:01:17 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హనుమకొండ పట్టణాకి చెందిన లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. సాధు రక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు అంబికేశ్వరానంద భారతి ఈ మేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గో సంరక్షణ, సాధు సంరక్షణ, గీతా సంరక్షణ, వేద సంరక్షణ, సనాతన పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు.