calender_icon.png 12 May, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దికుంట వద్ద రోడ్డుపై పడిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

11-05-2025 11:04:00 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట వద్ద రెడ్డి పేట రామారెడ్డి రోడ్డు పై గాలివానకు ఆదివారం సాయంత్రం పెద్ద చెట్టు రోడ్డు కు అడ్డంగా  పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులకు తెలిపిన స్పందించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించాలని మద్దికుంట, రెడ్డి పేట, అన్నారం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రామారెడ్డి మండలం నుంచి కాకుండా కామారెడ్డి నుంచి వెళ్లే ప్రయాణికులు నిజాంబాద్ జిల్లా సిరికొండ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు స్పందించి రోడ్డుని క్లియర్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.