26 May, 2026 | 1:45 AM

లక్ష్మీనారాయణ కాలనీ నూతన కమిటీ ఏకగ్రీవం

26-05-2026 12:53 AM

ఘట్ కేసర్, మే 25 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీ వాసులు రెండోసారి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ నూతన అధ్యక్షుడుగా ఈ.ఆర్. లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడుగా డి. వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి. డేవిడ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వీరాస్వామి, ఖజాంచిగా బాల మహీందర్, సలహాదారు డి. రాజలింగం, కమిటీ సభ్యులుగా డి. గణేష్, వి. శ్రీనివాస్, మహేష్ రెడ్డి, టి. విజయ్ భరత్, రాజు, ఈ.ఎల్. నందకుమార్, రమేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం రూ.1 లక్ష విరాళంగా అందిస్తున్నానని ప్రకటించారు.

అదేవిధంగా కాలనీలో ఉన్న నీటి సమస్యలు, పరిశుభ్రత, కాలనీ శుభ్రపరిచే పనులు, ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. అలాగే మా కాలనీకి ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను అని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న కాలనీ వాసులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.