చిన్న వయసులోనే చెస్ బరిలో చతురత చాటిన భట్టు జై
జిల్లా స్థాయి పోటీల్లో నాలుగో స్థానం
ఏకాగ్రత, తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనతో ఆకట్టుకున్న చిన్నారి
పాల్వంచ , మే 25, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్లో భట్టు జై ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం చెస్ ఛాంపియన్ షిప్2026 అండర్-9 విభాగంలో పాల్గొన్న భట్టు జై నాలుగో స్థానం సాధించి తన మేధస్సును చాటాడు.
చిన్న వయసులోనే చెస్పు ఆసక్తి, చురుకుదనం, సహనం, వ్యూహాత్మక ఆలోచనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన భట్టు జైకు త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా చెస్ ఆర్గనైజర్ గోపీకృష్ణ, స్టేట్ చెస్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు జ్యోత్స్న అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం నవభారత్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న భట్టు జై విజయానికి కోచ్ అన్వర్ అలీ అందించిన శిక్షణ, మార్గదర్శకం ఎంతో దోహదపడిందని తల్లిదండ్రులు చందు భట్టు, స్రవంతి ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.






