16 July, 2026 | 12:45 AM

తొలిరౌండ్‌లోనే లక్ష్యసేన్, ఆయుశ్ ఓటమి

16-07-2026 12:00 AM
  1. ఇక సింధుపైనే ఆశలు
  2. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్

టోక్యో, జూలై 15 : జపాన్ ఓపెన్ సూప ర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఆయుశ్ షెట్టి తొలిరౌండ్‌లోనే ప రాజయం పాలయ్యారు. జపాన్‌కు చెందిన కోకి వతనాబే చేతిలో లక్ష్య సేన్ వరుస గేము ల్లో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న లక్ష్యకు.. 17వ ర్యాంకర్ వతనాబే ఏ మాత్రం గెలిచే అవకాశం ఇవ్వలేదు. కేవలం 38 నిమిషాల్లోనే 21- 21- తేడాతో విజయం సాధించాడు.

మ రో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ కున్లావుట్ విటిడ్సార్న్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో విటిడ్సార్న్ 21 23 21- తేడాతో గెలుపొందాడు.