calender_icon.png 29 July, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

భూ కక్షలతో రగులుతున్న రాంపురం తండా

29-07-2025 08:24:42 AM

మోతే: సివిల్ తగాదలో తల దూర్చుతున్న  పోలీసులు మహిళ సంఘాల సభ్యులు బేరాలు కుదుర్చుకొని భూమి  అక్రమ దారులకు అండగా ఉంటు అసలైన భూమి యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతూ తెలిపారు. భూమి యజమానులు గ్రామంలోని భూమి చుట్టూ ఉన్న కొంత మంది రైతులు  తెలిపిన వివరాల ప్రకారంగా సర్వే నంబర్51 ఆ లోని ముగ్గురు వాటాదారులకు సుమారు 27 గుంటల భూమి ఉండగా ముగ్గురు తాత ల భాగస్వామ్యం లో ఒక బావి ని  ఒక గుంట భూమిలో తవ్వు కొని పారుగంత చేయడం జరిగిందని తెలిపారు. మా భూమికి సంబంధించి మరెవరికి అక్కడ భూమిగాని వాటా ధనం లేదని తేల్చి చెప్పారు.

మా భూమికి సంబంధించిన భూమిలో ఉండబడిన బావి ని సుమారు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసి 250 ట్రిప్పుల మోరం పోసి పూడ్చుకోవడం జరిగిందని చెప్పారు. గ్రామం లో పెద్దల కు ఈ భూమి గురించి పూర్తి వివరాలు తెలుసునని మా భూమి తో ఎక్కడ సంబంధం లేని వారు కొంత మంది కిరాయి మనుషుల తో మా పై దౌర్జన్యం చేస్తూ గ్రామం లో అలజడి సృష్టించడం చేస్తున్నారని వాపోతు తెలిపారు.  మా పై గొడవ పడుతున్న వారి పై  ఈ నెల 11 తారీఖున పోలీసు స్టేషన్ లో కేసు పెట్టగా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పైగా పోలీసు వారు మా పై దౌర్జన్యం చేస్తూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఇకనైనా రెవిన్యూ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.