calender_icon.png 29 July, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లా సైన్స్ ఆఫీసర్ నియామకాలకు నోటిఫికేషన్ ?

29-07-2025 08:26:40 AM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ లో నిబంధనలో విరుద్ధంగా జిల్లా సైన్స్ అధికార(District Science Officer ) నియామకానికి డిఏఓ వెంకటేశ్వర చారి నోటిఫికేషన్ జారీ చేశారని తెలుస్తోంది. గత నెలలో జిల్లా సైన్స్ అధికారిగా పనిచేస్తున్న శ్రీ ఎస్ చలపతిరావు  పదవి విరమణ పొంది ఉన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్  నియామకం కొరకు భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేశారు.

ఎస్ సి ఈ ఆర్ టి నిబంధన లకు మేరకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ సైన్స్ టీచర్ , సైన్స్ నేపథ్యం ఉన్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయులును జిల్లా సైన్స్ అధికారిగా నియమించాలనీ నిబంధన ఉంది.  భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన నోటిఫికేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంది. మొదటి ప్రాధాన్యత హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి తమ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి ఎస్ సి ఈ ఆర్ టి నిబంధనలకు విరుద్ధంగా  ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన నిబంధనలను సవరించి  నిబంధనల మేరకే జిల్లా సైన్స్ అధికారిని నియమించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.