మానవత్వాన్ని చాటుకున్న ఉపాధ్యాయ బృందం
తోటి ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక సాయం
వెంకటాపూర్, జులై 27 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న సహచరుల కుటుంబాలకు అండగా నిలుస్తూ వెంకటాపూర్ మండల ఉపాధ్యాయులు తమ సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మండల కేంద్రంలోని గరల్స్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జయప్రద, వెల్తూర్లపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు మహమ్మద్ కుటుంబాలకు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందజేశారు.
తోటి ఉపాధ్యాయులు తమ వంతు సహకారాన్ని అందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సహాయం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా, కష్టకాలంలో తామంతా అండగా ఉన్నామనే ధైర్యాన్ని వారి కుటుంబాలకు అందించింది. ఉపాధ్యాయుల మధ్య ఉన్న ఐక్యత, పరస్పర సహకారం, మానవ తా విలువలకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు పద్మాకర్ రెడ్డి, సర్వర్, బాబురావు, శ్రీరంగం, ప్రధానోపాధ్యాయులు రాధిక, సురేష్, లక్ష్మారెడ్డి, భాగ్యలక్ష్మి, రాజిరెడ్డి, రవి, ఉపాధ్యాయ సంఘాల మండల నాయకులు ఓదెలు, రాజయ్య, కమలాకర్, శ్రీనివాస్, సతీష్, రాజేంద్రం, శ్యాం ప్రసాద్, లియాకత్ అలీ, రమేష్, చెన్నకేశవరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కరుణాకర్ పాల్గొన్నారు.






