భూ సమస్యలు పరిష్కరించుకోవాలి
వనపర్తి, జూన్ 3 ( విజయక్రాంతి ) : ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ స దస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. వనపర్తి జిల్లాలో జూన్ 3 నుంచి జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా మంగళవారం పానగల్ మండలంలోని బండపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
భూ సమస్యల పై దరఖాస్తు నింపడానికి ఇబ్బంది ఉ న్న వారికి సహాయం చేసేందుకు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ లను పెట్టడం జరిగిందని, వారి సహకారం పొందాలని సూచిం చారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకొని భూ తగాదాలు, సమస్య లు పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలను సూచించారు.
షెడ్యూలు ప్రకారం గ్రామా ల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఆర్.ఐ ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






