భూసమస్యలు భూభారతి చట్టంతో పరిష్కారం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్11: ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆర్డీఓ వేణుమాధవరావు చెప్పారు.బుధవారం మండల పరిధిలోని కోడూరు గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టంలో అధికారులే రెవెన్యూ గ్రామాలకు వచ్చి గ్రామసభలు నిర్వహిస్తున్నారని,సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకుంటే సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చట్టం రూపొందించిందని అన్నారు.
గ్రామాలకు వచ్చిన రెవెన్యూ అధికారులకు రైతులు సహకరించాలని కోరారు.అనంతరం గ్రామంలో రైతుల నుండి 90దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భాషపాక శ్రీకాంత్,నయాబ్ తహశీల్దార్ చిప్పలపల్లి యాదగిరి,గిర్దవార్లు జలంధర్ రావు,వెంకటరెడ్డి,రెవెన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.






