12-07-2024 12:05:00 AM
న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ నెలాఖరున లంకలో పర్యటించనున్న భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మ్యాచ్‌లన్నీ పల్లెకెలె, కొలంబో వేదికగా జరగనున్నాయి. ముందుగా టీ20 సిరీస్‌తో టూర్ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా ఈ నెల 26, 27, 29వ తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం ఆగస్టు 1, 4, 7వ తేదీల్లో కొలంబో వేదికగా టీమిండియా మూడు వన్డేలు ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ పర్యటనకు గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లీ, బుమ్రా దూరంగా ఉండే అవకాశముంది. హార్దిక్ పాండ్యా లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది.
హసరంగ రాజీనామా
శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో దారుణ ఆటతీరుతో లంక జట్టు గ్రూప్ దశకే పరిమితమైంది. హసరంగ రాజీనామాను లంక క్రికెట్ బోర్డు ఆమోదించింకొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనుంది.
భారత్, లంక షెడ్యూల్
టీ20 సిరీస్
జూలై 26 తొలి టీ20
జూలై 27 రెండో టీ20
జూలై 29 మూడో టీ20
ప
ల్లె
కె
లె
వన్డే సిరీస్
ఆగస్టు 1 తొలి వన్డే
ఆగస్టు 4 రెండో వన్డే
ఆగస్టు 7 మూడో వన్డే
కొల
ంబో