calender_icon.png 5 February, 2026 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎన్‌జే ఆస్పత్రిలో పండ్లు పంపిణీ

05-02-2026 02:00:57 AM

ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో..

ఖైరతాబాద్, ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లక్డికాపూల్‌లోని ఐఐఎంసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1, 2, సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 300 మంది క్యాన్సర్ బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రఘువీర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పొగాకు, పొగాకు ఉత్పత్తులు, హానికర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు, క్యాన్సర్ కారక ఉత్పత్తులపై అందరికీ అవగాహన కల్పిస్తే వివిధ రకాల క్యాన్సర్ల భారీన పడకుండా ఎంతో మందిని కాపాడవచ్చునన్నారు. కార్యక్రమంలో ఇ.రామకృష్ణ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ యూనిట్ 2, ఎం. సత్యనారాయణ ప్రోగ్రాం ఆఫీసర్ యూ నిట్ 1, సామాజిక బాధ్యత కమిటి కన్వీనర్ విజయానంద్, కో కన్వీనర్ దీపక్, విజయ్, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, సామాజిక బాధ్యత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.