calender_icon.png 22 May, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక ఐటీ విప్లవ దిక్సూచి స్వర్గీయ మాజీ ప్రధానీ రాజీవ్ గాంధీ

21-05-2025 10:20:58 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు..

పెన్ పహాడ్ : భారతదేశంలో సాంకేతిక ఐటి విప్లవ రంగానికి దిక్సూచి, నాంది పలికిన మహనీయుడు భారత ప్రజల ఆశాజ్యోతి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. యువత దేశాభివృద్ధిలో కీలకమైన వ్యక్తులని భావించిన రాజీవ్ గాంధీ యువతలో మార్పు కోసం డిజిటల్ కంప్యూటర్ యుగమే సరైనదని ఆరంగాన్ని బలోపేతం చేయడంలో రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పిన్నేని కోటేశ్వరరావు, జూకూరి గాంధీ, ఆర్తీ కేశవులు, జానీమియా, శివనాయక్, కొన్నె జానయ్య, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.