21-05-2025 10:18:03 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. బోడు రోడ్ సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్యానాయక్, ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, వాంకుడోత్ పుణ్యా, బానోత్ బద్రు, లక్ష్మయ్య, సంజయ్, మధురెడ్డి, సర్ధార్, రవీందర్ సింగ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.