calender_icon.png 22 May, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు కంటి వైద్య పరీక్షలు

21-05-2025 10:23:26 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రీయ బాల స్వస్తి కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్(District Medical Officer Ravi Rathod) ఆదేశించారు. బుధవారం మహబూబాబాద్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి సరైన చికిత్స అందించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఎనీమియా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా సివియర్ ఎనీమియా, మోడరేట్ ఎనీమియా, మైల్డ్ ఎనీమియా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆర్.బి.ఎస్.కే బృందాలు ట్రైబల్ వెల్ఫేర్ కేజీబీవీ, ఇతర విద్యాలయాల్లో నిర్వహించిన సందర్శనలో గుర్తించిన వివిధ రకాల వ్యాధిగ్రస్తుల వివరాలను హెడ్మాస్టర్, మండల వైద్యాధికారి, ఆర్ బి ఎస్ కే టీం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్ డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ ప్రసాద్, హెచ్ ఇ ఓ రామకృష్ణ, డాక్టర్ కుమార్, డాక్టర్ శివరాం పాల్గొన్నారు.